తెలంగాణలో కొత్తగా 1,673 కరోనా కేసుల నమోదు

  • గత 24 గంటల్లో 48,583 కరోనా పరీక్షలు
  • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,165 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 13,522 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 48,583 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,165 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123 కేసులు గుర్తించారు. అదే సమమంలో 330 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,94,030 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,76,466 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,522 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,042కి పెరిగింది.

Telangana
Corona Virus
Media Report
Bulletin

More Telugu News